షేక్ హసీనా వల్ల భారత్‌కు ముప్పు ఉందని బంగ్లాదేశ్ ప్రభుత్వ తాత్కాలిక విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. షేక్ హసీనా విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ మాట్లాడుతూ, హసీనా భారత్‌లోనే కొనసాగితే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.