Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ‘‘అణుశక్తి’’కి సంబంధించి కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ‘‘విక్షిత్ భారత్ అణుశక్తి చాలా ముఖ్యమైందని’’ వ్యాఖ్యానించిన మంత్రి.. భారత్ ఇప్పుడు స్మాల్ రియాక్టర్లను, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అభివృద్ధి చేయడానికి, పరిశోధనలు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు.