Vikram S rocket launch successful: భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయం ప్రారంభం అయింది. తొలిసారిగా దేశీయ ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ ప్రయోగం విజయవంతం అయింది. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ‘ప్రారంభ్’ పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. శుక్రవారం శ్రీహరికోట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి విక్రమ్-ఎస్ రాకెట్ ని విజయవంతంగా నింగిలోకి పంపారు