Vikram-S: భారతీయ అంతరిక్ష రంగంలో అద్భుతం.. తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం సక్సెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vikram S rocket launch successful: భారత అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయం ప్రారంభం అయింది. తొలిసారిగా దేశీయ ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ ప్రయోగం విజయవంతం అయింది. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ‘ప్రారంభ్’ పేరుతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. శుక్రవారం శ్రీహరికోట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి విక్రమ్-ఎస్ రాకెట్ ని విజయవంతంగా నింగిలోకి పంపారు. మూడు పేలోడ్లను తనతో పాటు అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఉదయం 11.30 గంటలకు విక్రమ్-ఎస్ నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం 4.50 నిమిషాల్లో ప్రయోగం పూర్తయింది. దేశానికి చెందిన రెండు పేలోడ్లతో పాటు అర్మేనియాకు చెందిన విదేశీ పేలోడ్ ను 89.5 కిలోమీటర్ల లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టింది.
Read Also: Twitter : ఎలాన్ మస్క్‌కు ఉద్యోగుల షాక్.. ట్విట్టర్‌కు వందలాది మంది గుడ్ బై
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
మొత్తం 545 కిలోల బరువుతో, 6 మీటర్ల పొడవు ఉండే విక్రమ్-ఎస్ దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్. రాకెట్ గమనం, వేగం, ఖచ్చితత్వాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ రాకెట్ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. 2020లో అంతరిక్షంలో ప్రైవటు కంపెనీలకు అవకాశాలను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రయోగించిన తొలి రాకెట్ గా విక్రమ్-ఎస్ చరిత్రకెక్కింది. భారత అంతరిక్ష ప్రయోగాల్లో ఇది కొత్త అధ్యాయమని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఇది కొత్త ప్రారంభం అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. ఇస్రోకు అభినందనలు తెలిపారు కేంద్రమంత్రి. భారత అంతరిక్ష పితామహుడుగా పేరొందిన విక్రమ్ సారాభాయ్ పేరుతో ఈ రాకెట్ కు విక్రమ్ – ఎస్ అని నామకరణం చేశారు.
Mission Prarambh is successfully accomplished.
Congratulations @SkyrootA
Congratulations India! @INSPACeIND pic.twitter.com/PhRF9n5Mh4— ISRO (@isro) November 18, 2022
India's first ever private rocket Vikram-S, named after Vikram Sarabhai, launched from Sriharikota in Andhra Pradesh. The rocket has been built by "Skyroot Aerospace". pic.twitter.com/DJ9oN0LPfH
— ANI (@ANI) November 18, 2022
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?