India's first bullet train: భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్, ముంబై మధ్య బుల్లెట్ రైల్ కారిడార్‌ని రూ. 1.08 లక్షల కోట్లతో నిర్మిస్తోంది. నేషనల్ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సిఎల్) ఈ పనులను చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం 270 కిలోమీటర్ల గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తైందని ఇటీవల కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్ వెల్లడించారు. 270 కి.మీ పొడవునా వైర్ డక్ట్‌ను విజయవంతంగా ఏర్పాటు చేయడం…