Indians In Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కనీసం 12 మంది భారతీయులు మరణించినట్లు ఈ రోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరణించిన భారతీయులు అంతా రష్యా తరుపున పోరాడిన వారేనని వెల్లడించింది.
Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరుపున పలువురు భారతీయులు బలవంతంగా పనిచేయాల్సి వస్తోంది. యుద్ధంలో రష్యా తరుపున పోరాడుతూ ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయంపై భారత్ తన అభ్యంతరాన్ని ఇప్పటికే రష్యాకు చెప్పింది. భారతీయుల్ని యుద్ధ క్షేత్రం నుంచి పంపించాలని సూచించింది. ఇదిలా ఉంటే, తాజాగా కేరళ త్రిస్సూర్ లోని కురంచేరికి చెందిన 32 ఏళ్ల జైన్ కురియన్ వీడియో వెలుగులోకి వచ్చింది.