ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ముందు నుంచి ఈ ప్రచారం జరుగుతున్న విధంగానే సినిమాకి ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, సినిమాకి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ కూడా బయటికి ఇచ్చేశారు మేకర్స్. Also Read…