ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే హను రాఘవపూడి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మేరకు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ముందు నుంచి ఈ ప్రచారం జరుగుతున్న విధంగానే సినిమాకి ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, సినిమాకి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ కూడా బయటికి ఇచ్చేశారు మేకర్స్.
Also Read :Stock Market: మార్కెట్‌లో కొత్త జోష్.. భారీ లాభాల్లో దూసుకెళ్తున్న సూచీలు
ఇక టైటిల్ పోస్టర్ పరిశీలిస్తే, మన చరిత్రలో ఉన్న ఒక ధైర్యవంతుడైన సోల్జర్ గురించి ఈ సినిమా చేస్తున్నామని, చరిత్రలోని హిడెన్ చాప్టర్స్‌లో నుంచి ఈ కథ చెప్పబోతున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక, ఈ కథను పురాణాలతో లింక్ చేస్తూ – పద్మవ్యూహాన్ని గెలిచిన అర్జునుడు, పాండవుల కోసం పోరాడే కర్ణుడు, గురువులేని ఏకలవ్యుడు, అతను పుట్టుకతోనే ఒక యోధుడు – అంటూ ఒక్కసారిగా ఈ సినిమా మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేసేశారు.
Also Read :Mirai’s triumph : ఘనంగా జరిగిన ‘మిరాయ్’ విజయోత్సవ వేడుక..
ఇక ఒక జాతీయ జెండాని తగలబెడుతూ ఉండగా, ప్రభాస్ ఇంటెన్స్ లుక్‌తో ఉన్న పోస్టర్‌ని సినిమా టీం రిలీజ్ చేసింది. అంతేకాక, ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్న కొందరు నటుల పేర్లను కూడా వెల్లడించింది. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఇక విశాల్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సుదీప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా టీ సిరీస్‌తో కలిసి నిర్మిస్తోంది.