జార్ఖండ్ జెసూట్ ఫాదర్, ఆదివాసుల అభ్యున్నతికి అంకితమైన హక్కుల కార్యకర్త,స్టాన్‌స్వామి నిర్బంధంలోనే ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని కుదిపేస్తున్నది.82 ఏళ్ల ఈ వయోవృద్ధ సంఘ సేవకుడు గత అక్టోబర్8న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ(ఎన్‌ఐఎ) భీమ్ కొరగావ్ కేసులో అరెస్టయినప్పటి నుంచి అనేక బాధలుపడుతూనే బెయిలు కోసం పోరాడుతూ వచ్చారు.పార్కిన్‌సన్ వ్యాధిగ్రస్తుడైన స్టాన్‌స్వామికి కరోనా కూడా సోకింది.ఎట్టకేలకు మే28న ముంబాయిహైకోర్టు ఆయన బెయిల్ పిటిషిన్‌ను స్వీకరించింది. కాని బెయిల్ ఇవ్వడం గాక చికిత్స కోసం హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి తరలించాల్సిందిగా…