ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కన్నా భారత టీ20 లీగ్‌కే ఎక్కువ ఆదాయం సమకూరుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నారు. తాజాగా ఇండియా లీడర్‌షిప్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అతడు భారత టీ20 లీగ్ గురించి, టీమ్‌ఇండియాలో తన కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. తాను ఎంతగానో ఇష్టపడే క్రికెట్ చాలా అభివృద్ధి చెందిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఆట ఎంత అభివృద్ధి చెందిందో తాను కళ్లారా చూశానని సౌరభ్ గంగూలీ వెల్లడించారు. తనలాంటి క్రికెటర్లు ఇక్కడ…