Tata Sierra: టాటా మోటార్స్ (Tata Motors) నుంచి వచ్చిన లెటెస్ట్ SUV సియెర్రా(Sierra) బుకింగ్స్‌లో అదరగొడుతోంది. బుకింగ్స్ ప్రారంభించిన తొలి రోజే 70,000 బుకింగ్స్ వచ్చాయి. మరో 1.35 లక్షల మంది కస్టమర్లు తమకు నచ్చిన వేరియంట్, కాన్ఫిగరేషన్‌ను ఎంపిక చేసుకుని బుకింగ్ ప్రక్రియను పూర్తి చేసే దశలో ఉన్నారని కంపెనీ వెల్లడించింది. టాటా సియెర్రా బాక్సీ డిజైన్ కార్ లవర్స్‌ను ఆకట్టుకుంది. రూ. 11.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) అగ్రిసివ్ ప్రారంభ ధర కూడా వినయోగదారుల్ని…
ప్రసిద్ధ చెక్ ఆటోమేకర్ స్కోడా.. భారత మార్కెట్‌లోకి కొత్త SUVని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ త్వరలో దాని SUV లైనప్‌లోకి కొత్త చేరిక అయిన స్కోడా కోడియాక్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. ఏడు సీట్ల పూర్తి పరిమాణ SUVని త్వరలో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు స్కోడా ఆటో బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జనేబా ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు.
భారతీయ SUV మార్కెట్‌లో ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. ఈ వాహన విభాగాన్ని దృష్టిలో ఉంచుకొని, వాహన తయారీదారులు కొత్త మోడల్స్‌ను పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో, టాటా మోటార్స్ త్వరలో టాటా సియెర్రా SUVని భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది.