ఒక స్త్రీ, ఒక పురుషుడు కలిసి చాలాకాలంగా సహజీవనం చేస్తున్నట్లైతే వారి మధ్య బంధాన్ని వైవాహిక సంబంధంగానే పరిగణించాలంటూ సుప్రీం కోర్టు గతంలో స్పష్టం చేసింది. వారికి పుట్టిన సంతానానికి తమ పూర్వీకుల ఆస్తిలో వాటా పొందే హక్కు కూడా ఉంటుందని తేల్చి చెప్పింది. సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తులు వారి తదనంతరం వారసులకు లేదా రక్తసంబంధీకులకు చెందుతాయి.
Supreme Court: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్(సీఏఏ)పై చర్చ జరుగుతున్న సందర్భంలో, సుప్రీంకోర్టులోకి కీలక కేసు వచ్చింది. ఒకవేళ ఒక వ్యక్తి ముస్లిం కుటుంబంలో జన్మిస్తే అతనున ఆస్తి విషయంలో లౌకిక చట్టాలు పాటించవచ్చా.? లేదా షరియా, ముస్లిం వ్యక్తిగత చట్టాలు పాటించవచ్చా..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది.