Ashwini Vaishnaw: రైల్వేలో ఒక్క పొరపాటు, ఒక్కరి తప్పు వేల మందిని బలిగొంటుంది. అలాంటి రైల్వేలో సిబ్బంది, లోకో పైలట్లకు సంబంధించి పరీక్షలు కూడా నిక్కచ్చిగా ఉంటాయి. తాజాగా రాజ్యసభలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రైల్వే అధికారులు మొత్తం 8,28,03,387 బ్రీత్‌లైజర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
రైలు ప్రయాణం చాలా సులువైంది.. సౌకర్య వంతమైంది.. అందుకే ఎక్కువ మంది రైళ్లో ప్రయాణించడానికి ఇష్టపడతారు.. ప్రతిరోజు లక్షలాది మంది రైలు మార్గంలో ఒక చోటి నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నారు.. రైలులో ప్రయాణించడానికి టిక్కెట్ ను కొనడం ముఖ్యం.. అలా చేయకపోతే రైల్వే నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఈ రోజు మేము రైల్వేకు చెందిన మరికొన్ని నిబంధనల గురించి మీకు చెప్పబోతున్నాము. పాటించకపోతే, మీరు జరిమానా చెల్లించవలసి ఉంటుంది.. రైలు లో ప్రయాణించే వాళ్లు ఈ…
రేపు జరిగే ఫైనల్ పోరు కోసం.. ఇప్పటికే అభిమానులు అహ్మదాబాద్ కు భారీగా చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు నుంచి న్యూఢిల్లీ టూ అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలును నడుపుతోంది భారతీయ రైల్వే. ప్రస్తుతం విమాన టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటిన క్రమంలో క్రికెట్ అభిమానులకు రైల్వే తరలింపు బిగ్ రిలీఫ్ ఇచ్చే వార్త.
Fire Accident: ఇటీవల కాలంలో భారతీయ రైల్వేలో ప్రమాదాలు కలవరపరుస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రైలు బోగీలు మంటల్లో చిక్కుకోవడం చూస్తు్న్నాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ఇటావాలో ఈ రోజు న్యూఢిల్లీ-దర్భంగా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ లోని ఒక బోగీలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. రైలు సరాయ్ భూపత్ స్టేషన్ గుండా వెళ్తున్నప్పుడు స్లీపర్ కోచ్ లో పొగలు రావడాన్ని స్టేషన్ మాస్టర్ గమనించి అప్రమత్తం చేశారు.
Patalkot Express: మరో రైలు ప్రమాదానికి గురైంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ నుండి మధ్యప్రదేశ్‌లోని శివానికి వెళ్తున్న పాతాల్‌కోట్ ఎక్స్‌ప్రెస్ (14624)లోని నాలుగు కోచ్‌లలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా థానా మల్పురాలోని బధాయి రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైలు ఆగ్రా నుంచి ఝాన్సికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Sealdah Rajdhani Express: సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఒక వ్యక్తి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అతన్ని అరెస్టు చేసి రైలు నుండి దించేశారు. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని రైల్వే పోలీసులు తెలిపారు.
Vande Bharat Sleeper Train: భారతీయ రైల్వే త్వరలో కాన్సెప్ట్ రైలును తీసుకురానుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అత్యాధునిక స్లీపర్ బోగీలతో అమర్చబడుతుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం (అక్టోబర్ 3) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో వందే భారత్ రైలు స్లీపర్ వెర్షన్ డిజైన్ కు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు.
Indian Railways increases it’s Compensation to 10 times: సాధారణంగా రైలు ప్రమాదాల్లో ఎవరైనా గాయపడినా, ప్రాణాలు కోల్పోయిన రైల్వే బోర్డు వారికి పరిహారం చెల్లిస్తూ ఉంటుంది. ఈ పరిహారాన్ని గతంలో 2013లో పెంచారు. తాజాగా వీటిపై నిర్ణయం తీసుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ ఈ పరిహారాలను పది రెట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి రైల్వే బోర్డు సెప్టెంబర్ 18న ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కొత్త నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని…
Indian Railways: భారతీయ రైల్వే ఆదాయానికి సంబంధించి ఒక పెద్ద వార్త బహిర్గతం అయింది. ఇటీవల ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంలో పిల్లల టిక్కెట్లను విక్రయించడం ద్వారా భారతీయ రైల్వే రూ.2800 కోట్లు ఆర్జించింది.