Ashwini Vaishnaw: లోకో పైలట్లు తాగి విధులకు వస్తున్నారా..? ఐదేళ్లలో బ్రీత్‌లైజర్ టెస్టుల్లో 1761 మంది ఫెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwini Vaishnaw: రైల్వేలో ఒక్క పొరపాటు, ఒక్కరి తప్పు వేల మందిని బలిగొంటుంది. అలాంటి రైల్వేలో సిబ్బంది, లోకో పైలట్లకు సంబంధించి పరీక్షలు కూడా నిక్కచ్చిగా ఉంటాయి. తాజాగా రాజ్యసభలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో రైల్వే అధికారులు మొత్తం 8,28,03,387 బ్రీత్‌లైజర్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
ఐదేళ్ల కాలంలో 1761 మంది లోకోపైలట్లు బ్రీత్‌లైజర్ పరీక్షలో ఫెయిల్ అయ్యారని శుక్రవారం రాజ్యసభకు తెలిపారు. ఇందులో 674 మంది ప్యాసింజర్ లోకోపైలట్లు కాగా.. 1087 మంది గూడ్స్ లోకోపైలట్లుగా తేలింది. పరీక్షల్లో విఫలమైన లోకో పైలట్లు రైలును నడపేందుకు అనుమతించబడరు. నిర్దేశించి విధానాల ప్రకారం వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోబడుతాయని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
Read Also: Tipu Sultan Row: మరోసారి “టిప్పు సుల్తాన్” వివాదం.. మైసూర్ ఎయిర్‌పోర్టు పేరు మార్పు ప్రతిపాదన..
2014 నుంచి రైల్వేలో అందరు లోకో పైలట్లు, వారి అసిస్టెంట్లు తమ షిఫ్ట్ విధుల్లో చేరే ముందు వారికి బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్(BAC) అంచనా వేసేందుకు బ్రీత్‌లైజర్ పరీక్షను తప్పనిసరిగా చేశారు. నిబంధనల ప్రకారం, BAC స్థాయి 100 ml రక్తానికి 1-20 మిల్లీగ్రాముల మధ్య ఉంటే, డ్రైవర్ సర్వీస్ రికార్డ్‌లో ఉల్లంఘన పేర్కొనబడుతుంది. అది 21 మిల్లీగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, డ్రైవర్‌ని సర్వీసు నుంచి తీసేస్తారు.
కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించిన డేటా ప్రకారం.. ఉత్తర రైల్వేలో ఎక్కువ బ్రీత్‌లైజర్ పరీక్షలు జరిగాయి. ఇక్కడ ఏకంగా 521 మంది లోకో పైలట్లు పరీక్షల్లో విఫలమయ్యారు. ఈ గణాంకాల్లో దక్షిణ మధ్య రైల్వే మెరుగైన స్థానంలో ఉంది. ఉత్తర రైల్వే తర్వాత పరీక్షల్లో దక్షిణ మధ్య రైల్వే రెండోస్థానంలో ఉంది. ఇక్కడ 85,25,988 పరీక్షలు నిర్వహిస్తే.. కేవలం 73 మంది లోకో పైలట్లు ఫెయిల్ అయ్యారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!