దేశంలోని 4 పెద్ద మెట్రో నగరాల్లో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు మరోసారి తగ్గాయి. ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ కొత్త ధరలను నవంబర్ 16 నుంచి అమలులోకి తెచ్చింది. ఇదిలా ఉంటే.. దీపావళికి ముందు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రూ.50కి పైగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.57.50కి తగ్గడంతో.. 19 కిలోల బ్లూ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1775.50కి చేరింది.