‘వన్ జెర్సీ వన్ నేషన్’ స్లోగన్‌తో సోమవారం నాడు విడుదల చేయగా.. అది నారింజ, నీలం రంగుల కలయికతో కూడి ఉంది. ఈ జెర్సీపై వీ ఆకారంలో త్రివర్ణ రంగులతో రూపొందించారు. అయితే ఈ జెర్సీపై క్రికెట్ అభిమానుల దగ్గర నుంచి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతుంది. 2019 వన్డే ప్రపంచకప్ జెర్సీ ఉన్నట్లు ఉందని కొందరు అంటుంటే.. బీజేపీ పార్టీ రంగును పోలి ఉందని మరి కొందరు విమర్శలకు దిగుతున్నారు.