తెలుగు ఇండియన్ ఐడిల్ తుది దశకు చేరుకుంది. ఆరుగురు కంటెస్టెంట్స్ తో జరిగే సెమీ ఫైనల్ కు బాలకృష్ణ గెస్ట్ గా రాబోతున్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇది జూన్ 10వ తేదీ ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బాలకృష్ణ ‘నేను జడ్జిని కాదు… వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన కంటెస్టెంట్స్ ను’ అంటూ తోటి కంటెస్టెంట్స్ లో హుషారు…
తెలుగు ఇండియన్ ఐడిల్ సరదా సరదాగా సాగిపోతోంది. చూస్తుండగానే 10వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టేసింది. ఈ వీకెండ్ లో ‘సూపర్ హీరోస్ స్పెషల్’ పేరుతో చేసిన కార్యక్రమంలో శనివారం పన్నెండు మందిలో మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ తమ ప్రతిభను చాటారు. తొలుత శ్రీనివాస్ ధరంశెట్టి ‘ఇంద్ర’ సినిమాలోని ‘భం భం భోలే’ గీతాన్ని పాడాడు. మణిశర్మ స్వరపరచగా సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను మూవీలో శంకర్ మహదేవన్, హరిహరన్ గానం చేశారు. అదే విషయాన్ని తమన్ తలుచుకున్నారు.…
తెలుగు ఓటిటి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఎప్పటికప్పుడు వస్తున్న క్రేజీ రియాలిటీ షోల జాబితాలో మరో పాపులర్ షో కూడా చేరబోతున్న విషయం తెలిసిందే. తెలుగు భాషలో పాపులర్ మ్యూజిక్ షో ‘ఇండియన్ ఐడల్’ను ప్రసారం చేయబోతున్నారు. భారతదేశపు అత్యంత ప్రసిద్ధ సింగింగ్ రియాలిటీ షో ఇప్పుడు తెలుగులో కూడా రానుంది. ఈ షోకు హోస్ట్ గా సింగర్ శ్రీరామ చంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తుండగా, ఇండియన్ ఐడల్ సీజన్ 9 విజేత, ఎల్‌వి రేవంత్ కూడా…