Jagdeep Singh Arrest: అమెరికాలో ఇండియన్ గ్యాంగ్‌స్టర్ జగ్గా అరెస్ట్ అయ్యాడు. రాజస్థాన్, పంజాబ్‌లలో అనేక క్రిమినల్ కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్టర్ జగ్దీప్ సింగ్ అలియాస్ జగ్గాను అమెరికాలో అరెస్టు చేశారు. ఆయన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు సన్నిహితుడు, ప్రస్తుతం రోహిత్ గోదారా నెట్‌వర్క్‌తో సంబంధం కలిగి ఉన్నాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. జగ్గాను అమెరికా – కెనడా సరిహద్దు సమీపంలో అరెస్టు చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే జగ్గాను భారతదేశానికి అప్పగించడానికి చట్టపరమైన…