సినిమా రంగంలో నటిగా, సమాజ సేవలో తనదైన ముద్ర వేసిన అమల అక్కినేని ఇప్పుడు విద్యా రంగంలో కూడా తన ప్రతిభను చూపిస్తున్నారు. తాజాగా ఆమె అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా తరఫున మెక్సికోలో జరుగుతున్న CILECT కాంగ్రెస్ 2025లో పాల్గొంటున్నారు. ఈ కాన్ఫరెన్స్ అక్టోబర్ 27 నుండి 31 వరకు గ్వాడలజారాలో జరుగుతుంది. CILECT అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా, టెలివిజన్, మీడియా కాలేజీల సంఘం. ఇందులో సినిమా విద్య, సాంకేతికత, సృజనాత్మకత…