H1B Visa: డోనాల్డ్ ట్రంప్ పేల్చిన H1B వీసా ఫీజు పెంపు బాంబు ప్రభావం మన దేశంలో కనిపించడం ప్రారంభమైంది. ఈ దుష్ప్రభావం భారతీయ వివాహాలపై కనిపిస్తోంది. వీసా రుసుము $100,000 (సుమారు రూ. 88 లక్షలు) కు పెంచిన వెంటనే.. అమెరికాలో పనిచేసే NRI వరులకు డిమాండ్ తగ్గింది. ఒక నివేదిక ప్రకారం.. ఇప్పటివరకు తమ పిల్లలకు అంతర్జాతీయ సంబంధాలు చూస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా నిర్ణయాన్ని మార్చుకున్నాయి. ట్రంప్ విధానాల కారణంగా NRIల ఉద్యోగ ప్రమాదం…
H-1B Visa Row: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కు పెంచడం ఒక్కసారిగా భారతీయ టెక్కీలో ఆందోళన నింపింది. తమ అమెరికన్ డ్రీమ్స్‌ను ట్రంప్ కాలరాస్తున్నాడనే ఆవేదన వ్యక్తమైంది. H-1B వీసా ఫీజు పెంపు విషయం గందరగోళంగా మారుతున్న తరుణంలో మేము ఉన్నామంటూ ఓ యూరోపియన్ దేశం ముందుకు వచ్చింది. భారత టెక్కీలు తమ దేశానికి రావాలని ఆహ్వానించింది.
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నివాసి రాజ్‌కుమార్ మిశ్రా దేశానికి కీర్తిని తెచ్చిపెట్టారు. ఆయన భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లి అక్కడి మేయర్ ఎన్నికల్లో గెలిచారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన రాజ్ కుమార్ లండన్ లోని వెల్లింగ్ బరో నగర మేయర్ గా ఎన్నికయ్యారు. దీంతో ఆయన స్వగ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.
UK: గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ ఖలిస్తానీ మూకలు రెచ్చిపోయాయి. లండన్‌లోని భారత రాయబార కార్యాలయం వెలుపల గుమిగూడిన కొంత మంది ఖలిస్తానీ మద్దతుదారులు భారత దేశం, భారత సమగ్రతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, అదే సమయంలో రిపబ్లిక్ డే వేడులకు చూసేందుకు వచ్చిన ప్రవాస భారతీయులు,