Air India: వాణిజ్య విమానయాన చరిత్రలో ఎయిరిండియా సరికొత్త అధ్యాయం లిఖిస్తోంది. ఫ్రాన్స్ సంస్థ ఎయిర్‌బస్‌తోపాటు అమెరికా కంపెనీ బోయింగ్‌తో అతిపెద్ద ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండింటి నుంచి 500లకు పైగా కొత్త విమానాలను కొనుగోలు చేస్తోంది. తద్వారా భారతదేశ విమానయాన రంగంలో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఎయిరిండియా ఆశిస్తోంది. అదే సమయంలో.. లోకల్ లో-కాస్ట్ ప్రత్యర్థి సంస్థలను మరియు ఎమిరేట్స్ వంటి పవర్‌ఫుల్ గల్ఫ్ ఎయిర్‌లైన్స్‌ను ధీటుగా ఢీకొట్టబోతోంది.