అన్నపూర్ణ పర్వతంపై తప్పిపోయిన భారతీయ పర్వతారోహకుడు 34 ఏళ్ల అనురాగ్ మాలూను క్షేమంగా ఉన్నాడు. అనురాగ్ ను సజీవంగా రక్షించారు. ప్రపంచంలోని 10వ ఎత్తైన శిఖరం క్యాంప్ III దిగువన ఉన్న పగుళ్లలో అనురాగ్ ను కనుగొన్నట్లు సెవెన్ సమ్మిట్ ట్రెక్స్‌కు చెందిన థానేశ్వర్ గురాగైన్ తెలిపారు. కానీ మాలూ ఆరోగ్యం విషమంగా ఉంది మరియు ప్రస్తుతం పోఖారాలోని మణిపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని గురాగైన్ తెలిపారు.