Golden Shawl: రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ తన ప్రత్యేక నైపుణ్యంతో మరోసారి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా త్రివిధ దళాల (సైన్యం, నౌకాదళం, వాయుసేన) చిత్రాలను బంగారు శాలువాపై నేసి తన దేశభక్తిని చాటుకున్నాడు.
2019 శాసనసభ ఎన్నికల్లో నాటి ప్రభుత్వం కుట్ర చేసి తనను కొడంగల్ లో ఓడిస్తే.. పద్నాలుగు రోజుల్లో ఎంపీగా గెలిపించారని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి గుర్తు చేశారు.. ఎన్నికల్లో రక్తాన్ని చెమటగా మార్చారని.. కాబట్టే మీ ముందు ముఖ్యమంత్రిగా నిలబడ్డానన్నారు. తాజాగా బాచుపల్లిల వీఎన్ఆర్ కాలేజ్ నుంచి ప్రారంభమైన జై హింద్ ర్యాలీలో సీఎం ప్రసంగించారు.. ఖర్గే.. రాహుల్ గాంధీ.. ఆదేశాల మేరకు జై హింద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.