Nurse Nimisha Priya: యెమెన్‌లో కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (36)కు మరణశిక్ష విధించిన విషయం కలకలం రేపుతోంది. యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిష ప్రియ దోషిగా తేల్చబడగా, ఇటీవలే యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఆమె మరణశిక్షను ధృవీకరించారు. ఈ శిక్షను నెల రోజుల లోపు అమలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై భారత విదేశాంగశాఖ స్పందించింది. నిమిష ప్రియ కేసు తమ దృష్టికి వచ్చినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి…