అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలు.. ఇంకా కళ్లముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంకా మృతదేహాల అప్పగింత కూడా పూర్తికాలేదు. ఈలోపే మళ్లీ మళ్లీ విమానాల్లో లోపాలు బయటపడుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలు.. గాల్లో దీపాలుగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అన్న భయం.. విమానం ఎక్కే వారిలో కనిపిస్తోంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ? లోపాలు ఎక్కడ ఉన్నాయి ? విమానాల్లో సాంకేతిక సమస్యాలా లేక నిర్వహణలో రూల్స్ పాటించకపోవడమా ?
కెనడాలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని మోడీ-ఇటలీ ప్రధాని మెలోని కలుసుకున్నారు. దీంతో ఇద్దరి కలిసి కరచాలనం చేసుకున్నారు. చాలా సేపు షేక్హ్యాండ్ ఇచ్చుకుంటూ.. ఇద్దరు నవ్వుకుంటూ సంభాషించుకున్నారు.
ప్రధాని మోడీ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు కెనడా వెళ్లారు. జీ 7 సమ్మిట్లో ఉన్న దేశాధినేతలంతా సమావేశానికి హాజరయ్యారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు మోడీ కూడా కెనడా వెళ్లారు.
చాలా మంది అమెరికాలో చదువుకోవాలని.. అక్కడ స్థిరపడాలని కలలు కంటారు. కానీ పరిస్థితులు.. ఒకప్పటిలాగా లేవు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసలపై కఠినమైన ఆంక్షలు పెట్టారు.
India Canada: కెనడా ఇప్పుడిప్పుడే దారికి వస్తోంది. గతంలో, జస్టిన్ ట్రూడో ప్రధానిగా ఉన్న సమయంలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు మద్దతుగా నిలిచాడు. తన రాజకీయాల కోసం భారత్తో సంబంధాలను పణంగా పెట్టాడు. ప్రస్తుతం, మార్క్ కార్నీ ప్రధానిగా గెలిచిన తర్వాత భారత్తో కెనడా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. జీ -7 సమావేశానికి ప్రధాని నరేంద్రమోడీని కెనడా ఆహ్వానించింది. స్వయంగా కెనడా ప్రధాని కార్నీ మోడీకి ఫోన్ చేశారు.
గోల్డ్ లవర్స్కు మళ్లీ ధరలు షాకిస్తున్నాయి. నిన్నామొన్నటి దాకా ధరలు అటు.. ఇటుగా ఊగిసలాడుతూ ఉండేవి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మళ్లీ బంగారం ధరలు ఆకాశన్నంటుతున్నాయి.