Islamabad magistrate issues arrest warrant against Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం అవుతోంది. ఇమ్రాన్ ఖాన్ పై ఇస్లామాబాద్ మేజిస్ట్రేట్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మహిళా న్యాయమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇస్లామాబాద్ కోర్టు అరెస్ట్ చేయాలని వారెంట్ జారీ చేసినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. పీటీఐ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి కోల్పోయిన తర్వాత నుంచి పాకిస్తాన్ వ్యాప్తంగా పర్యటిస్తూ..పీఎం…
Putin Comments On India: ఉక్రెయిన్ లోని జోపోరిజ్జియా, ఖేర్సన్, లూహాన్స్క్, డోనెట్స్క్ నాలుగు ప్రాంతాలను అధికారికంగా రష్యా తనలో కలుపుకుంది. అయితే దీనిపై యూఎస్ఏతో పాటు యూరోపియన్ దేశాలు మండిపడుతున్నాయి. రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది అమెరికా. రష్యా బెదిరింపుకు భయపడేది లేదని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వ్యాఖ్యానించారు. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు రష్యాపై మరింతగా ఆంక్షలు విధించేందుకు సిద్ధం అయ్యాయి. జి 7 దూశాలు కూడా రష్యా, ఉక్రెయిన్ భూభాగాలను…
క్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను విలీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఐరాస భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా రష్యా వీటో చేసింది. ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది.
పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా మరోసారి భారత్‌లో నిలిచిపోయింది. పాకిస్థాన్ ప్రభుత్వ ట్విట్టర్ ఖాతా నిలిపివేయడం ఇది రెండోసారి.
ఆసియా కప్ టోర్నీ తమ సత్తా చాటేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇంగ్లండ్‌పై సిరీస్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు.. శనివారం నుంచి టీ20 ఫార్మాట్లో ఆసియాకప్ ఆడనుంది.
టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతూ టీ20 వరల్డ్ కప్‌కు దూరమయ్యాడంటూ వచ్చిన కథనాలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు దూరం కాలేదని స్పష్టం చేశారు.
Websites ban: ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. చిన్నారుల నుంచి మొదలు వృద్ధుల వరకు రోజంతా వాటితోనే కాలక్షేపం చేస్తున్నారు. కరోనా పుణ్యమాని ఆన్ లైన్ క్లాసులు రావడంతో చదువుకునే పిల్లలకు ఫోన్లు తప్పనిసరై పోయాయి. పిల్లల చేతికి ఫోన్లు చేరడంతో వారంతా వాటితో ఏం చేస్తున్నారో కూడా కనిపెట్టడం తల్లిదండ్రులకు కష్టంగా మారింది. టీనేజ్.. ఇది ఆకర్షణలకు గురయ్యే వయసు. మీడియాలో పెరుగుతున్న అశ్లీలత్వం…
భారత త్రివిధ దళాల నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. భార్య అనుపమా చౌహాన్‌తో కలిసి ఆయన ఇవాళ సీడీఎస్ ఆఫీసుకు వచ్చారు.
నిషేధిత గ్రూప్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన మరుసటి రోజే సామాజిక మాధ్యమాల్లో ఆ సంస్థకు సంబంధించిన ఖాతాలు నిలిపివేయబడ్డాయి.
భారత్‌లోని అన్ని ప్రాంతాల క్రీడాకారులు పోటీపడే సమయం ఆసన్నమైంది. దేశంలోని అత్యుత్తమ అథ్లెట్ల మధ్య క్రీడా సమరం నేటి నుంచి జరగనుంది. గుజరాత్లో గురువారం 36వ జాతీయ క్రీడలను నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.