Pakistan comments on buying oil from Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికాతో పాటు అన్ని పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోలును నిలిపివేశాయి యూరోపియన్ దేశాలు. ఇలాంటి కష్టసమయంలో భారత్, రష్యాకు అండగా నిలిచింది. డిస్కౌంట్ పై రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది. ఇటీవల కాలంలో భారత్, రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురు పెరిగింది. అయితే భారత్ చర్యపై అమెరికాతో పాటు పలు యూరోపియన్…
Pakistani authorities' silence on Dawood Ibrahim's hand over To India: అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంతో పాటు, 26/11 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ అప్పగింతపై పాకిస్తాన్ అధికారులు సమాధానం దాటవేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్ పోల్ జనరల్ అసెంబ్లీ కార్యక్రమానికి పాకిస్తాన్ తమ దేశం తరుపున ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) డైరెక్టర్ జనరల్ మొహసీన్ భట్ ను పంపింది. ఇద్దరు సభ్యులు ఈ కార్యక్రమంలో…
Corona Virus: ఒమిక్రాన్ వేరియంట్‌తో ముగిసిపోయిందని భావించిన కరోనా కొత్త రూపు సంతరించుకుంది. బీఎఫ్-7 అనే వేరియంట్‌తో మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తొలుత చైనాలో వెలుగు చూసిన ఈ వేరియంట్ చాలా వేగంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, బెల్జియం వంటి దేశాలకు వ్యాపిస్తోంది. దీని వ్యాప్తిని నిరోధించే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే అది డామినెంట్ వేరియంట్‌గా మారుతుందని చైనాకు…
భారత్ జోడో యాత్రలో అపశ్రుతి తలెత్తింది. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రస్తుతం కర్ణాటకలోని బళ్లారి జిల్లా న్యూమోకా గ్రామంలో కొనసాగుతుండగా.. ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు స్తంభానికి జెండాలు కడుతుండగా ఐదుగురు కరెంట్ షాక్‌కు గురయ్యారు.
Pakistan summons US envoy over Joe Biden's comments: పాకిస్తాన్ దేశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలపై సమన్వయం లేని కారణంగా పాకిస్తాన్ ప్రపంచంలోనే ప్రమాదకర దేశాల్లో ఒకటి అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ దేశాన్ని షాక్ కు గురిచేశాయి. అమెరికాతో ఇప్పుడిప్పుడే సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నామని అనుకుంటున్న పాకిస్తాన్ కు ఇది మింగుడు పడటం లేదు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ తమ నిరసన తెలుపుతోంది.
ఆకలి సూచీలో భారత్ అట్టడుగు స్థానానికి పడిపోయింది. భారతదేశం 121 దేశాలతో విడుదల చేసిన జాబితాలో 2021లో 101 స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 107వ స్థానానికి పడిపోయింది.
వివాహాన్ని రద్దు చేయడానికి ఆర్టికల్ 142 ప్రకారం తమ అధికారాన్ని ఉపయోగించలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. దంపతుల్లో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
T20 World Cup 2022: ఈనెల 16 నుంచి టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లు ప్రారంభం కాబోతున్నాయి. అయితే అసలు టోర్నీ మాత్రం ఈనెల 22న ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో ఆరంభం అవుతుంది. ఈనెల 23న టోర్నీలోనే హైఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. ఆరోజు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పైనే క్రికెట్ అభిమానుల ఆసక్తి నెలకొంది. ఈ మెగా టోర్నీకే ఈ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆసియా కప్ తర్వాత దాయాది దేశాలు…