ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ లోక్‌సభ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థి అయిన పండిట్ కేశవ్ దేవ్, భారత ఎన్నికల సంఘం తనకు కేటాయించిన పోలింగ్ చిహ్నాన్ని బాగా వినియోగించుకోవడం ద్వారా ఎన్నికల ప్రచారానన్ని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసాడు. అతని ఎన్నికల గుర్తు చెప్పుల జత కావడంతో., స్వతంత్ర అభ్యర్థి ఏడు చెప్పులు కలిసున్న ఓ దండను ధరించి తన ప్రచార బాటలో కనిపించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ షేర్ చేసిన వీడియోలో.. పండిట్ కేశవ్…
ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. అందుకే ఈ పండుగకు యుగం+ఆది 'యుగాది' లేదా 'ఉగాది' అని పేరు వచ్చింది. తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కృత యుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాం.
భారత సైన్యంలో అధికారుల కొరతను తీర్చేందుకు కొత్త సర్వీస్ సెలక్షన్ బోర్డులు (ఎస్ఎస్బీ) తెరవనున్నారు. భారత సైన్యం దీనిపై కసరత్తు చేస్తోంది ఈ ఏడాది చివరి నాటికి 3 కొత్త సర్వీస్ సెలక్షన్ బోర్డులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా ప్రస్తుతం 12 బోర్డులు ఉన్నాయి, అది కాస్తా త్వరలో 15 అవుతుంది.
లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ కన్నేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ 'అబ్ కీ బార్ 400 పార్' నినాదాన్ని ఇచ్చింది.
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం నేడు ఏర్పడనుంది. ఇవాళ ఏర్పడబోయే సూర్య గ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారతీయ ప్రామాణిక కాలమానం ప్రకారం, ఏప్రిల్ 8, 2024న రాత్రి 09:12 గంటలకు ప్రారంభమై, ఏప్రిల్ 9, 2024న తెల్లవారుజామున 2:22 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. ఉత్తర అమెరికాలోని ఎంచుకున్న ప్రాంతాలు సంపూర్ణ గ్రహణాన్ని ఎదుర్కొంటాయి.
ప్రజలు గుజరాత్ మోడల్ విడిచి పెట్టి ద్రవిడ మోడల్ అనుసరించాలని మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ పిలుపునిచ్చారు. భారత్ ఇకపై ద్రవిడ మోడల్ పాటించాలని పేర్కొన్నారు.
సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో నిర్మించిన భారత దేశపు మొట్ట మొదటి ఐస్ కేఫ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్ లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన లడక్ లో ఈ ఐస్ కేఫ్‌ను రెడీ చేశారు.
Pakistan: ఉగ్రవాదులపై రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఉగ్రవాదుల్ని వదలేది లేదని, ఉగ్రవాదులు పాకిస్తాన్ తిరిగి పారిపోతే, అక్కడికి వెల్లి వారిని చంపేస్తామని అన్నారు.