సింగపూర్ ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతీయ ప్రతిభను మెచ్చుకున్నారు. భారత్ లోని ఐఐటీ(IIT), ఐఐఎం(IIM)ని ప్రశంసించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన 20 ఏళ్ల ప్రధానమంత్రి పదవీకాలం గురించి చర్చించారు.
మాల్దీవుల్లో నివసిస్తున్న భారత సైనికులంతా ఇప్పుడు స్వదేశానికి చేరుకున్నారు. మాల్దీవుల నుంచి భారత్ తన సైనికులందరినీ ఉపసంహరించుకున్నట్లు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది.
పాలస్తీనాను సభ్యదేశంగా చేయాలనే ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్ మద్దతు తెలిపింది. పాలస్తీనాకు మద్దతుగా ఓటేసింది. ఐక్యరాజ్యసమితిలో అరబ్ దేశాల సమూహం సమర్పించిన తీర్మానంలో పాలస్తీనా సభ్యత్వానికి పూర్తి అర్హత కలిగి ఉందని పేర్కొంది.
India-Canada: ఖలిస్తాన్ మద్దతుదారులకు, ఇండియా వ్యతిరేకులకు మద్దతుగా వ్యవహరిస్తోంది కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత
మాల్దీవులు- భారత్ మధ్య కొంత కాలంగా ఓ వివాదం కొనసాగుతోంది. కొద్దినెలల కిందట భారత ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన చేశారు. ఆయన సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్న నేపథ్యంలో మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Pakistan : పాకిస్తాన్లో భారతీయ సంస్కృతి జెండాను ఎగురవేసిన సింధ్ నుండి హిందువులు ప్రతేడాది భారతదేశాన్ని సందర్శిస్తారు. వారు షాదానీ దర్బార్ హరిద్వార్ కు వస్తారు.
UWW suspends Bajrang Punia: భారత స్టార్ రెజ్లర్, టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత భజరంగ్ పూనియాపై సస్పెన్షన్ వేటు పడింది. అంతర్జాతీయ రెజ్లింగ్ సంస్థ (యూడబ్ల్యూడబ్ల్యూ) పూనియాపై సస్పెన్షన్ వేటు వేసింది. డోప్ పరీక్షకు నిరాకరించినందుకు ఇప్పటికే జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ (నాడా) తాత్కాలికంగా సస్పెండ్ చేసిన పూనియాపై తాజాగా యూడబ్ల్యూడబ్ల్యూ చర్యలు తీసుకుంది. పూనియాపై యూడబ్ల్యూడబ్ల్యూ ఏడాది నిషేధం విధించింది. 2024 చివరి వరకూ అతడు ఎలాంటి పోటీల్లో పాల్గొనకూడదు. దాంతో…
భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు గుడ్న్యూస్ చెప్పింది. వివిధ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, ఉరుములు, వడగళ్ల వానలు, వేడిగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నున్ కేసులో భారత్కు రష్యా అండగా నిలిచింది. అమెరికా వాదనలను మాస్కో తీవ్రంగా ఖండించింది. అంతే కాకుండా 'భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని' ఆరోపించింది.
ఢిల్లీ యూనివర్శిటీలోని గార్గి కాలేజీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) విషయంలో తమ ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. పీఓకేను తిరిగి భారత్కు తీసుకురావడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.