Suryakumar Yadav: మొదటిసారి అవార్డు వచ్చింది.. ఎవరికీ ఇవ్వను: సూర్య
- అఫ్గాన్‌పై భారత్ విజయం
- సూర్యకుమార్ సూపర్ హాఫ్ సెంచరీ
- మొదటిసారి అవార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav on Player of the Match: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో అఫ్గాన్‌ను భారత్ చిత్తుచేసింది. టీమిండియా విజయంలో మిస్టర్ 360, టీ20ల్లో టాప్ ర్యాంకర్ సూర్యకుమార్ యాదవ్ (53: 28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక పాత్ర పోషించాడు. నాలుగు కీలక వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును సూర్య అద్భుత హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. హార్దిక్ పాండ్యాతో కలిసి జట్టు స్కోరును 150 దాటించాడు. దాంతో భారత్ 181 పరుగులు చేసి.. అఫ్గాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆపై బౌలర్లు చెలరేగడంతో రోహిత్ సేన ఘన విజయం సాధించింది.
హాఫ్ సెంచరీతో సత్తా చాటిన సూర్యకుమార్ యాదవ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. టీ20 ప్రపంచకప్ 2024లో ఓ భారత బ్యాటర్ ఈ అవార్డు అందుకోవడం ఇదే మొదటిసారి. దాంతో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మెగా టోర్నీలో భారత బ్యాటర్లకు దక్కిన తొలి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అని సూర్య సంతోషం వ్యక్తం చేశాడు. భారత బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన చేశారని, అవార్డు అందుకునేందుకు వారిలో ఒకరు అర్హులని పేర్కొన్నాడు. అయితే అవార్డును మాత్రం ఎవరికీ ఇవ్వనని సరదాగా అన్నాడు. దాంతో అక్కడ అందరూ నవ్వుకున్నారు.
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు తీసుకున్న అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘చాలా హార్డ్‌వర్క్ చేశాను. గత కొన్ని రోజులుగా నేను పడ్డ కష్టానికి ఈరోజు మంచి ఫలితం దక్కింది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఏమి చేయాలనుకున్న దానిపై స్పష్టంగా ఉన్నా. ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌ను ఓ భారత బౌలర్‌కి ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఈ టోర్నీలో మొదటిసారి భారత బ్యాటర్‌కి అవార్డు వచ్చింది. దీనిని ఎవరికీ ఇవ్వాలనుకోవడం లేదు’ అని చెప్పాడు.
Also Read: Shah Rukh Khan Mansion: అమెరికాలో షారుఖ్ ఖాన్ మాన్షన్.. ఒక రాత్రికి 2 లక్షలు!
‘రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఆడటం చాలా కష్టం. ప్రపంచంలోనే అతడు అత్యుత్తమ స్పిన్నర్. రషీద్ బౌలింగ్‌లో నేను జాగ్రత్తగా బ్యాటింగ్ చేశాను. ఎప్పుడైనా పిచ్ కండిషన్స్‌కు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. హార్దిక్ పాండ్యా క్రీజులోకి వచ్చినప్పుడు ఇదే ఇంటెంట్‌తో బ్యాటింగ్ కొనసాగిద్దామని చెప్పా. హార్దిక్ బాగా ఆడాడు. 180 స్కోర్ చేయడం సంతోషంగా అనిపించింది. ఇదే ఆటను కొనసాగిస్తాము’ అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.
తాజావార్తలు
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
-
vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!