Canada: తీరుమార్చుకోని కెనడా.. ఖలిస్తానీల ‘‘సిటిజన్ కోర్టుల’’పై భారత్ ఆగ్రహం..
- ఖలిస్తానీ ఉగ్రవాదులపై కెనడా మెతక వైఖరి..
- సిటిజన్ కోర్టుల పేరుతో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం..
- కెనడాకు భారత్ తీవ్ర నిరసన..
- పట్టనట్లు వ్యవహరిస్తున్న ట్రూడో ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Canada: కెనడా ఖలిస్తానీ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులపై మెతక వైఖరి అవలంభిస్తూనే ఉంది. భారత్ ఎన్నిసార్లు నిరసన తెలిపినప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తమకు పట్టనట్లు వ్యవహరిస్తోంది. మరోవైపు ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతికి ఆ దేశ పార్లమెంట్ నివాళి అర్పించడాన్ని బట్టి చూస్తే కెనడా ఏ రకంగా వారికి మద్దతు తెలుపుతుందో అర్థం అవుతోంది. నిజ్జర్ హత్య తర్వాత నుంచి భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి.
Read Also: International Yoga Day 2024: ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం.. ‘సూర్య నమస్కారం’
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
ఇదిలా ఉంటే వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ వెలుపల ఖలిస్తానీ తీవ్రవాదులు “సిటిజన్స్ కోర్టు” అనే పేరుతో భారత ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేయడంపై గురువారం భారత్, కెనడాకు తమ నిరసన వ్యక్తం చేసింది. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం చోటు ఇవ్వడంపై భారత్ తమ నిరసనను కెనడా హైకమిషన్‌కి తెలియజేసింది.
గతేడాది కెనడాలోని సర్రే నగరంలో గురుద్వారా వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని కాల్చి చంపారు. ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ ప్రమేయం ఉందని ఏకంగా కెనడా ప్రధాని ట్రూడో చెప్పడం సంచలనమైంది. దీనిపై భారత్ కూడా ఘాటుగా స్పందించింది. కెనడా తీవ్రవాదులు, ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని విమర్శించింది. ట్రూడో ఆరోపణల్ని అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. ఈ ఘటన తర్వాత ఖలిస్తానీలు కెనడాలోని భారత దౌత్యకార్యాలయాలపై తరుచుగా దాడులకు, నిరసనలకు తెగబడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?