Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi Controversy : సినిమా హిట్ అయితే ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. అయితే అదే సినిమాలో కొన్ని సన్నివేశాలు అసౌకర్యంగా అనిపిస్తే ప్రశ్నలు కూడా వేస్తారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతున్న ‘పెద్ది’ సినిమా చుట్టూ ఇలాంటి చర్చే నడుస్తోంది. ఒకవైపు భారీ వసూళ్లతో రామ్ చరణ్ కెరీర్లో మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తున్న ఈ సినిమా, మరోవైపు జాన్వీ కపూర్ పోషించిన అచియ్యమ్మ పాత్ర చిత్రీకరణపై తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఈ వివాదంలో ప్రముఖ నటి ఆషిక రంగనాథ్ కూడా స్పందించి జాన్వీ కపూర్కు మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది.
దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ‘పెద్ది’ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్రామీణ నేపథ్యం, ఎమోషనల్ కథనం, రామ్ చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నప్పటికీ, సినిమాలోని రొమాంటిక్ ట్రాక్పై కొంతమంది ప్రేక్షకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అచియ్యమ్మ పాత్రను చూపించిన విధానం, ఆమెను కథలో కంటే గ్లామర్ కోణంలో ఎక్కువగా ప్రదర్శించారనే విమర్శలు సోషల్ మీడియాలో విస్తృతంగా వినిపిస్తున్నాయి.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
ఈ నేపథ్యంలో కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఆషిక రంగనాథ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించారు. మహిళా పాత్రలను కేవలం గ్లామర్ కోసం మాత్రమే ఉపయోగించే ధోరణిని ప్రశ్నించారు. ఒక పాత్ర సరిగా రాయబడలేదని అనిపిస్తే దానికి బాధ్యత ఆ పాత్ర పోషించిన నటిపై కాకుండా, కథను రాసినవారు, సినిమా తీస్తున్న దర్శకులపైనే ఎక్కువగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. నటీమణులు పెద్ద సినిమాల్లో భాగం కావాలని, విస్తృత ప్రేక్షకులను చేరుకోవాలని కోరుకుంటారని, అందుబాటులో ఉన్న అవకాశాలను మాత్రమే స్వీకరిస్తారని పేర్కొన్నారు.
ఈ వివాదానికి కారణమైన కొన్ని సన్నివేశాలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సినిమాలో అచియ్యమ్మ (జాన్వీ కపూర్) ఆసక్తి చూపకపోయినా, కరెంట్ పోయిన సమయంలో ఆమె అనుమతి లేకుండా ముద్దు పెట్టుకోవడం వంటి సన్నివేశాలపై విమర్శలు వచ్చాయి. ఈ వివాదం పెరగడంతో దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా స్పందించారు. సినిమా ప్రేక్షకులను అలరించాలి, ప్రేరేపించాలి కానీ ఎవరినీ అసౌకర్యానికి గురిచేయకూడదని చెప్పుకొచ్చారు. కొన్ని సన్నివేశాలపై వచ్చిన విమర్శలను తాము గౌరవిస్తున్నామని, అసౌకర్యంగా భావించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు. కొన్ని సీన్స్ లో మార్పులు కూడా చేయనున్నట్లు వెల్లడించారు. ఏదిఏమైనా వివాదాలు కొనసాగుతున్నప్పటికీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద తన విజయయాత్రను కొనసాగిస్తోంది.
- Tags
- cinema
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..