పుణే టెస్టులోనూ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 156 పరుగులకే కుప్పకూలగా... రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ భారీ ఆధిక్యంపై కన్నేసింది. కాగా.. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్సింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. దీంతో.. భారత్‌పై న్యూజిలాండ్ 301 పరుగుల ఆధిక్యం సాధించింది.
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు . ఎక్స్‌లో కాంగ్రెస్ అధినేత తన అభిప్రాయాన్ని వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలను నెలకొల్పడంలో ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు విఫలమయ్యాయని ఆరోపించారు.
భారతదేశం పొరుగున ఉన్న మాల్దీవుల ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆర్థిక సంస్కరణల ప్రయత్నాల్లో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు ఖర్చు తగ్గింపును ప్రకటించారు. మహ్మద్ ముయిజ్జూ తన జీతంలో 50 శాతం తీసుకోబోరని రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. రుణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, మాల్దీవులలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా కోత విధించబడుతుంది.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దృష్టి సారించింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన మరో ఏడుగురు షూటర్లను అరెస్ట్ చేసింది.
Justin Trudeau: కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సన్నిహిత బృందంలో ఖలిస్థాన్ ఉగ్రవాదులు, భారత వ్యతిరేకులు ఉన్నారని అక్కడి హైకమిషనర్‌గా పని చేసిన సీనియర్ దౌత్యాధికారి సంజయ్ వర్మ ఆరోపణలు చేశారు.
Khalistani Terrorist: భారత్‌లోని సీఆర్పీఎఫ్ స్కూల్స్ మూసివేయాలని అమెరికాలోని ఖలిస్థానీ టెర్రరిస్టు గురు పత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించాడు. ఒకప్పటి సీఆర్పీఎఫ్ అధికారి, పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్, మాజీ రా అధికారి వికాస్ యాదవ్‌లు తమ(సిక్కుల) హక్కుల హననానికి పాల్పడ్డరారని పన్నూన్ ఆరోపణలు చేశాడు.