క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఆదివారం టీమిండియా, పాకిస్థాన్ మరోసారి తలపడనున్నాయి. గ్రూప్-ఏలో వరుసగా రెండు మ్యాచ్లో విజయం సాధించి తొలిస్థానంలో ఉంది టీమిండియా. ఇక పాక్ ఒక మ్యాచ్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. వరుసగా రెండింటిలో ఓడిన హాంకాంగ్ ఆసియాకప్ నుంచి వెళ్లిపోయింది. దీంతో తొలిరెండు స్థానాల్లో ఉన్న టీమిండియా, పాక్ మరోసారి పోటీపడబోతున్నాయి. ఈ హైవోల్టేజ్ సమరానికి టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్లో గెలిచి ఫుల్ జోష్లో…
ఆసియా కప్ 2022లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి దాయాదుల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో గత టీ20 ప్రపంచకప్ ఓటమికి ప్రతీకారంగా టీమిండియా ఘన విజయాన్ని సాధించింది.
ఇదిలా ఉంటే శ్రీనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( ఎన్ఐటీ) విద్యార్థులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉండటంతో కొన్ని ఆదేశాలను జారీ చేసింది. విద్యార్థులు గ్రూపులగా మ్యాచ్ చూడద్దని.. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేయవద్దని స్టూడెంట్స్ వెల్ఫెర్ డీన్ నోటీసులు జారీ చేశారు. ఎన్ఐటీ విద్యార్థులు మ్యాచ్ సమయంలో తమకు కేటాయించిన గదుల్లోనే ఉండాలని వర్సిటీ అధికారులు కోరారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో…
ఆసియా కప్లో ఇవాళ రసవత్తర పోరు జరగనుంది. అసలు సిసలైన మ్యాచ్కి సమయం ఆసన్నమైనది.. చిరకాల ప్రత్యర్థులు ఇండియా, పాకిస్తాన్… యుఏఈ వేదికగా తలపడనున్నాయి… దాయాది జట్ల మధ్య రసవత్తర పోరు జరిగితే ఆ మ్యాచ్.. ఓ చిన్న యుద్ధంలాగే ఉంటుంది. ఎప్పుడూ క్రికెట్ చూడనివారు కూడా.. ఈ మ్యాచ్ చూసి తీరుతుంటారు.. అభిమానుల కోలాహోలం మధ్య ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే రాజకీయ కారణాల వల్ల ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగనప్పటికీ.. ఐసీసీ టోర్నీ,…