ఆసియా కప్ 2025 ట్రోఫీ కాంట్రవర్సరీపై తెలుగు ఆటగాడు, టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ స్పందించాడు. సెప్టెంబర్ 28న పాకిస్థాన్‌తో ఫైనల్ అనంతరం తాము గంటసేపు మైదానంలోనే గడిపాము అని, గ్రౌండ్‌లో ట్రోఫీ ఎక్కడా కనిపించలేదని చెప్పాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతిలో ట్రోఫీ లేదని చెప్పాడు. అందుకే ట్రోఫీ అందుకొన్నట్లుగా తాము క్రియేట్ చేశాం అని తిలక్ తెలిపాడు. ఫైనల్‌లో భారత్ గెలిచినా.. నఖ్వీ ఇప్పటివరకు ట్రోఫీ…
సెప్టెంబర్ 28న దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్ 2025లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం స్టేడియంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పీసీబీ చీఫ్, ఏసీసీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా ప్లేయర్స్ తిరస్కరించారు. దాంతో నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు దక్కాల్సిన విజేత పతకాలను కూడా హాటల్‌కు తీసుకెళ్లిపోయాడు. దాంతో పీసీబీ, బీసీసీఐ మధ్య వివాదం చెలరేగింది.…
Abhishek Sharma: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025 ఎలాంటి విద్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై సాధించిన విజయం తర్వాత తన దూకుడు విధానాన్ని అతను సమర్థించుకున్నాడు. టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన అభిషేక్ శర్మ బౌలర్ ఎటువంటి వారైనా తన ఆటతీరులో మార్పు ఉండదని చెప్పాడు. Tollywood: సినీ కార్మికుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కమిటీ ఏర్పాటు ఇక…
దుబాయ్‌లోని రింగ్ ఆఫ్ ఫైర్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఆసియాకప్ ఫైనల్‌లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. హై ఓల్టేజ్ మ్యాచ్‌లో ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఆసియాకప్ 2025 విజేతగా నిలిచింది.
Asia Cup 2025 Prize Money: దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదిక అయ్యింది. ఆదివారం భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ఫలితం తేలనుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే గెలిచిన జట్టుకు కోట్ల రూపాయలు అందుతాయి. ఇది కామన్ కదా అని అనుకుంటున్నారు కదా.. ఇక్కడే ట్విస్ట్ ఉంది.. ఓడిపోయిన జట్టు కూడా సూపర్ రిచ్ అవుతుంది. ఇంతకీ ఈ ఓడిపోయిన,…
Sunil Gavaskar: యూఏఈలో జరుగుతున్న ఆసియా కప్ 2025లో భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ, బ్యాటింగ్‌లో మాత్రం ఇబ్బందులు పడుతున్నాడు. ఈ టోర్నీలో 5 ఇన్నింగ్స్‌లలో కేవలం 71 పరుగులు మాత్రమే చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో చేసిన 47 నాటౌట్ ఇన్నింగ్స్ మినహా అతని ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో, భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూర్యకుమార్‌కు ఒక సూచన ఇచ్చాడు. బ్యాటింగ్ ప్రారంభించేటప్పుడు కనీసం…
ఆసియా కప్ 2025లో బరిలోకి దిగిన టీమిండియా దూసుకుపోతోంది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన భారత్ అజేయంగా ఫైనల్‌కు చేరుకుంది. ఇక ఈ ఎడిషన్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మూడోసారి తలపడనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ఇండో-పాక్ మ్యాచ్ ఆరంభం కానుంది. భారత్ జోరు చూస్తే.. ఫైనల్‌లో ఈజీగా గెలుస్తుంది. అయితే ఒకే ఒక్క అంశం టీమిండియాను కలవరపెడుతోంది. ఆ ఒక్క అంశంఏంటంటే.. గత రికార్డ్స్. ఇప్పటి వరకు భారత్,…