India vs Pakistan: అమ్మో, భారత్‌తో మ్యాచ్ అంటేనే భయమేస్తుంది.. పాక్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
- నేడే ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్..
- భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..
- టీమిండియాతో మ్యాచ్ అంటే భయమేస్తుంది: పాక్ కెప్టెన్ అఘా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్- పాక్ మూడోసారి తలపడనున్నాయి. ఈసారి టైటిల్ కోసం ఫైనల్‌లో ఢీకునేందుకు ఇరు జట్లు రెడీ అయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియాతో మ్యాచ్ అంటే తమపై తీవ్ర ఒత్తిడి ఉంటుందన్నారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లను మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ఇండియా- పాక్ మధ్య మ్యాచ్ అంటేనే అభిమానుల్లో హైటెన్షన్ ఉంటుంది.. క్రికెటర్లపైనా బాగా ఒత్తిడి ఉండటం కామన్.. భారత్‌తో ఆడిన గత రెండు మ్యాచుల్లో మేం చాలా పొరపాట్లు చేయడంతోనే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. తక్కువ తప్పులు చేసిన టీం గెలుస్తుంది.. తప్పకుండా ఈ ఫైనల్‌లో గెలిచేందుకు ప్రయత్నిస్తామని సల్మాన్ అఘా వెల్లడించారు.
Also Read
- India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి భారీ శుభవార్త చెప్పిన బీసీసీఐ.. ఎట్టకేలకు లిస్ట్‌లో పేరు..
- Tilak Varma: ఆసియా కప్ ట్రోఫీ కాంట్రవర్సరీ.. సంచలన విషయం వెల్లడించిన తిలక్!
- BCCI vs PCB: ఎందుకయ్యా అతి చేస్తావ్.. ట్రోఫీపై నఖ్వీకి షాక్ ఇచ్చేందుకు బీసీసీఐ రెడీ
ఏసీసీ ప్రొటోకాల్స్‌ను ఫాలో అవుతాం..
ఇక, టీమిండియా ఏం చేయాలనుకుంటే అదే చేయనివ్వండి.. మేం మాత్రం ఏసీసీ ప్రోటోకాల్స్‌ను ఫాలో అవుతామని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా తెలిపారు. షేక్ హ్యాండ్ ఇవ్వాలని వస్తే మేం ముందడుగు వేస్తాం.. లేకపోతే లేదన్నారు. మా చేతుల్లో ఉండే వాటిపైనే మేము ప్రధానంగా దృష్టి పెడతాం.. మీడియాలో వచ్చేవి, బయట అనుకునే వాటిని లైట్ తీస్కుంటాం.. మా లక్ష్యం ఆసియా కప్ గెలవడం మాత్రమే అన్నారు. అయితే, అండర్ -16 రోజుల నుంచి నేను ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాను.. గత 20 ఏళ్లలో మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు కరచాలనం చేసుకోకుండా ఉండటం నేనెప్పుడూ చూడలేదని పాకిస్థాన్ సారథి సల్మాన్ పేర్కొన్నారు.
Read Also: Tamilnadu: తొక్కిసలాటకు స్టాలిన్ ప్రభుత్వమే కారణం- టీవీకే పార్టీ నేతలు
షేక్‌హ్యాండ్స్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు..
అయితే, భారత్, పాక్ దేశాల మధ్య పరిస్థితులు చాలా దారుణంగా ఉన్న రోజుల్లోనూ ఇలాంటివి జరగలేదని పాకిస్థాన్ కెప్టెన్ అఘా అన్నారు. ఇప్పుడు మాత్రం షేక్‌హ్యాండ్స్ ఇవ్వకపోవడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఇలాంటి పద్దతి క్రికెట్‌కు మంచిది కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నాడు. అయితే, సల్మాన్ అఘా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ‘కరచాలనం’పై స్పందించిన పాక్ సారథి.. తమ జట్టు ఆటగాళ్లు చేసిన చేష్టలపై ఎందుకు మాట్లాడలేదని భారత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!