HCA invites Students to watch IND vs ENG Test for free at Uppal Stadium: జనవరి 11 నుంచి అఫ్గానిస్థాన్‌తో భారత్ టీ20 సిరీస్ ఆడనుంది. అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనవరి 25న తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమవుతుంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)…
Jemimah Rodrigues on Debut Test Cap: తన అరంగేట్రం క్యాప్‌ను పెద్దక్కలాంటి స్మృతీ మంధాన నుంచి అందుకోవడం కెరీర్లోనే స్పెషల్ అని టీమిండియా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తెలిపారు. టెస్టుల్లోకి అరంగేట్రం సందర్భంగా క్యాప్ అందించిన మంధానకు జెమీమా ధన్యవాదాలు తెలిపారు. ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌పై భారత్ మహిళా జట్టు 347 పరుగులతో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 68 పరుగులు చేసిన…
ముంబై వేదికగా ఇంగ్లండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌లో టీమిండియా మహిళా టీమ్ పట్టు బిగుస్తుంది. భారత అమ్మాయిలు తలో చేయి వేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ బ్యాటర్లు 138 పరుగులకే ఆలౌట్ చేసి 292 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం టీమిండియా పొందింది.
Wasim Akram Heap Praise on Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పాకిస్థాన్ మాజీ స్టార్ వసీమ్ అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో బుమ్రానే అత్యుత్తమ బౌలర్ అని కితాబిచ్చాడు. నియంత్రణతో కూడిన వేగం, వైవిధ్యం వల్లే బుమ్రా స్థిరంగా రాణించగలుగుతున్నాడన్నాడు. ఔట్ స్వింగర్లను తన మాదిరే వేస్తున్నాడని, కొన్నిసార్లు తనను మించిన నియంత్రణతో బౌలింగ్ చేస్తున్నాడని అక్రమ్ ప్రశంసించారు. మొత్తంగా బుమ్రా తనకంటే బాగా బౌలింగ్ చేస్తున్నాడని…
Gautam Gambhir Hails Rohit Sharma’s Batting and Captaincy: వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా 6 మ్యాచులు గెలిచిన భారత్ సెమీస్ బెర్తును దాదాపు ఖరారు చేసుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో దూసుకుపోతుంది. బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో ఉండగా.. తామేం తక్కువ కాదని బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్ నిరూపించారు. భారత్ ప్రదర్శనపై టీమిండియా మాజీ…
Barmy Army slammed by India Fans for Trolling Virat Kohli: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం లక్నో వేదికగా జరిగిన భారత్, ఇంగ్లండ్ మ్యాచులో అభిమానులు ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముందుగా ఇంగ్లండ్ ఫాన్స్ ట్రోల్ చేయగా.. ఆపై భారత్ ఫాన్స్ గట్టిగా ఇచ్చిపడేశారు. ఇంగ్లండ్‌పై అద్భుత రికార్డు ఉన్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఆ జట్టు ఫాన్స్…
India ICC ODI World Cup Record: ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ అరుదైన రికార్డు సాధించింది. వన్డే ప్రపంచకప్‌లలో అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం లక్నోలోని ఏకానా స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్ ఈ రికార్డు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ (58)ను భారత్ అధిగమించింది. నిన్నటివరకు 58 విజయాలతో భారత్, న్యూజిలాండ్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.…
Virat Kohli Hugs Rohit Sharma During IND vs ENG Match: సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న టీమిండియా.. మెగా టోర్నీలో డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన ఏకంగా 100 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో విజయం సాధించిన భారత్.. పాయింట్ల పట్టికలో మరోసారి…
Rohit Sharma, Kuldeep Yadav Get Into Heated Argument Over DRS Call: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ ‘డబుల్ హ్యాట్రిక్’ నమోదు చేసింది. ఆదివారం లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. 230 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 129 పరుగులకే ఆలౌట్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229…
India Captain Rohit Sharma React on Victory vs England: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో టీమిండియా విజయం సాధించింది. లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో గెలిచి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాకుండా దాదాపుగా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌లో కీలక సమయాల్లో వికెట్లను చేర్చుకుని తక్కువ స్కోరుకే పరిమితమైనా.. అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని 129 పరుగులకే ఆలౌట్…