ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలిచిన తర్వాత చిత్ర యూనిట్ అంతా హైదరాబాద్ వచ్చేసారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాత్రం నేరుగా న్యూ ఢిల్లీ వెళ్లి అక్కడ ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నాడు. ఇండియన్ సినిమాకు ప్రతినిధిగా పాల్గొన్న చరణ్ తన కెరీర్ గురించి, నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం గురించి, నెపోటిజం గురించి తన అభిప్రాయాన్ని నేషనల్ మీడియా ముందు వెలిబుచ్చాడు. ఇండియా టుడే…
దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలన్నీ విజయవంతంగా నడుస్తున్నాయని, వాటిని చూసి ఓర్వలేకే కొందరు ఆరోపణలు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇండియా టుడే కాన్క్లేవ్ 2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కీలకోపన్యాసం చేస్తూ.. భారత ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థల విజయం కొందరిలో అసూయను కలిగిస్తోందని అన్నారు.
CJI DY Chandrachud: న్యాయశాఖ, ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కొలీజియం వ్యవస్థపై అసహనం వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు పలు కార్యనిర్వహాక వ్యవస్థ నియామకాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడంతో ఇరు వ్యవస్థల మధ్య ఉద్రిక్తత ఏర్పడుతోంది. అయితే న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన న్యాయమూర్తుల కొలీజియం వ్యవస్థను సమర్థిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఇండియా కాంక్లేవ్, 2023 కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలంటే బయటి ప్రభావాల నుంచి రక్షించబడాలని…
Kiren Rijiju: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రిటైర్డ్ జడ్జిలు భారతదేశ వ్యతిరేక ముఠాలో చేరారని అన్నారు. వారు న్యాయవ్యవస్థను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారు మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2023లో మాట్లాడుతూ కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య క్లియర్ గా రాజ్యాంగంలో విభజన ఉందని గుర్తు చేశారు. ఇటీవల న్యాయమూర్తుల జవాబుదారీతనంపై ఒక సెమినార్ జరిగింది.…