Ram Charan: నెపోటిజం అనే వాళ్లు నాకు అర్ధంకారు… నాన్న వల్లే నేనోచ్చాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ గెలిచిన తర్వాత చిత్ర యూనిట్ అంతా హైదరాబాద్ వచ్చేసారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మాత్రం నేరుగా న్యూ ఢిల్లీ వెళ్లి అక్కడ ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నాడు. ఇండియన్ సినిమాకు ప్రతినిధిగా పాల్గొన్న చరణ్ తన కెరీర్ గురించి, నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం గురించి, నెపోటిజం గురించి తన అభిప్రాయాన్ని నేషనల్ మీడియా ముందు వెలిబుచ్చాడు. ఇండియా టుడే కాన్‌క్లేవ్ ఈవెంట్ స్టేజ్ పైకి తన భార్య ఉపాసనని చరణ్ స్టేజ్ పైకి ఆహ్వానించడం అందరి మన్ననలు పొందింది.
మన సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ గెలిచిందన్న విషయాన్ని నేనింకా నమ్మలేకపోతున్నాను. నన్ను నేను గిల్లిచూసుకుంటున్నాను. ఆస్కార్ పొందడం అపురూపమైన విషయం. ఉపాసన నా లక్కీ మస్కాట్. ఆమె కడుపులో ఉన్న ఐదు నెలల శిశువు నాకు ఇంకా లక్కీ. త్వరలోనే తండ్రిని కాబోతున్నాను. అన్నీ మంచి విషయాలు ఒకసారే జరుగుతున్నాయి అని తన పర్సనల్ లైఫ్ విశేషాలతో మీడియా ఇంటరాక్షన్ మొదలుపెట్టిన చరణ్, ఆస్కార్ గెలుస్తామా? లేదా? అనేది నా దృష్టిలో పెద్ద విషయం కానే కాదు. ఆ వేదిక దాకా వెళ్లడమే నా దృష్టిలో పెద్ద గౌరవం. అది అరుదైన గుర్తింపు. మన సినిమాకు అక్కడ ప్రతినిధులుగా నిలుచోవడం ఆనందంగా అనిపించిందని చెప్పాడు.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
ఎన్టీఆర్ తో స్నేహం గురించి మాట్లాడిన చరణ్… “నేనూ, తారక్ RRR ప్రారంభం కావడానికి కొన్నేళ్ల క్రితమే స్నేహితులమయ్యాం. రాజమౌళి కాకపోయి ఉంటే, మరే దర్శకుడికోసమూ మేమిద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేసేవాళ్లం కాదేమో” అని చెప్పిన చరణ్, రాజమౌళితో నేను చేసిన తొలి సినిమా మగధీర బ్లాక్ బస్టర్ అయింది. టాస్క్ మాస్టర్లతో పనిచేయడం నాకు చాలా ఇష్టం. నా కాళ్ల మీద నేను నిలుచోవడం ఇష్టం. రాజమౌళిగారితో పనిచేయడం అంటే పాఠశాలకు వెళ్లినట్టే భావిస్తాను. మా నాన్న చిరంజీవి, మా బాబాయ్ పవన్ కల్యాణ్ తర్వాత నేను అంతగా గౌరవించే వ్యక్తి రాజమౌళినే అని జక్కన్నపై ఉన్న గౌరవాన్ని తెలిపాడు.
పాన్ ఇండియా సినిమాల గురించి చరణ్…
ఈ తరంలో రీజినల్ సినిమా అనేదే ఉండదు. ఇప్పటిదాకా మనకు వెస్ట్ బెంగాల్ నుంచి తమిళనాడు వరకు ఎన్నో రీజినల్ సినిమా ఇండస్ట్రీలు ఉండేవి. కానీ ఇప్పుడు సరిహద్దులు చెరిగిపోయాయి. మూలాల్లోకి వెళ్లి కథలను పట్టుకోగలగాలి. మగధీర అలాంటి సినిమానే. లగాన్ అలాంటి సినిమానే. కొరియా పారసైట్ ఆ తరహా సినిమానే. మట్టి కథను, పోరాటాల కథలను చెప్పగలిగినప్పుడు ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు వస్తాయి. గ్లోబల్ ఆడియన్స్ మన సినిమాలను ఇండియన్ సినిమాలను ఒక్క సినిమాగా చూడగలగాలి.
నెపోటిజం గురించి చరణ్…
నెపోటిజం మీద జరుగుతున్న చర్చ నాకెప్పుడూ అర్థం కాదు. అందరూ అంటారు కాబట్టి మిగిలినవారు కూడా అంటుంటారేమో. అసలు అందులోని లైన్ల గురించి ఎంత మంది అర్థం చేసుకుంటారో కూడా ఊహించలేం. ప్రఖ్యాత జర్నలిస్టు పిల్లలు జర్నలిస్టు కావాలనుకుంటారు. తల్లిదండ్రుల బాటలో పిల్లలు నడవాలనుకోవడం మనకు ఎప్పటి నుంచో వస్తున్నదే. నాకు సినిమా అంటే పంచప్రాణాలు. నేను పుట్టినప్పటినుంచే ఫిల్మ్ స్కూల్లో ఉన్నా. నాకు ఆ కళ తెలుసు. నేను పనిని సక్రమంగా చేయకపోతే ఈ ఇండస్ట్రీలో ఉండలేను. తల్లిదండ్రులు ఈ రంగంలో పేరు ప్రఖ్యాతులతో ఉంటే, ఒక్కడుగు ధైర్యంగా వేయగలుగుతారేమో! కానీ, తదనంతరం మన టాలెంటే మాట్లాడుతుంది. కేజీయఫ్ స్టార్ యష్ తండ్రి స్టార్ కాదు. కానీ ప్రతిభను ఎవరూ ఆపలేరు. ఎవరి విషయంలోనైనా అదే చెల్లుతుంది.
హాలీవుడ్ డెబ్యు గురించి చరణ్…
హాలీవుడ్‌లో పనిచేయాలని అనుకుంటున్నాను. నా కల నెరవేరుతుందని భావిస్తున్నాను. హాలీవుడ్ ప్రాజెక్టుకు సంతకం చేశానా? లేదా? అనేది ఇప్పుడు మాట్లాడటం సబబు కాదు. ఏదైనా మెటీరియలైజ్ అయ్యేవరకు ప్రాసెస్‌లో ఉన్నట్టే. కానీ, తప్పక జరిగి తీరుతుంది (నవ్వుతూ).
RC 16 సినిమా గ్లోబల్ మూవీ…
నేనిప్పుడు శంకర్‌తో సినిమా చేస్తున్నాను. ఈ చిత్రంలో పాత్ బ్రేకింగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. రంగస్థలం సినిమాను మించిన మరో సినిమాలో బెస్ట్ పాత్ర చేస్తాను. ఆ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ నుంచి ఉంటుంది. పాశ్చాత్యదేశాల్లోనూ ఆ సినిమాను అంగీకరిస్తారనే నమ్మకం ఉంది.
నన్ను ఒకటే సినిమా చెయ్యమంటున్నారు…
ఏక సమయంలో ఒక సినిమాకన్నా ఎక్కువే చేయాలనుకుంటున్నాను. నా ఈఎంఐలు కట్టుకోవాలంటే కష్టపడాలి. కానీ నేను పనిచేస్తున్నవారందరూ గొప్పగొప్పవారు. వారు నా పూర్తి ఏకాగ్రత ఒక్క సినిమా మీదే ఉండాలని కోరుకుంటున్నారు. ఏడాదికి రెండు సినిమాలు చేయాలన్నది నా చిరకాల కల. మా నాన్న 67 ఏళ్ల వయసులో మూడు సినిమాలు చేస్తున్నారు. ప్రతిరోజూ తెల్లారుజామున లేచి జిమ్‌కి వెళ్తారు. మా నాన్నలాగా నేను కూడా యాక్టివ్‌గా ఉండాలని జనాలు కోరుకుంటున్నారు.
రాజకీయాల్లోకి రాను…
నేను ఓ నావ మీదే ప్రయాణిస్తాను. ఆ నావ సినిమా ఇండస్ట్రీలోనే ఉంది. నాకు రాజకీయాలతో ప్రమేయం లేదు. రాజకీయనాయకుడిని కాదలచుకోవడం లేదు.
కోహ్లీ బయోపిక్ చేస్తే బాగుంటుంది…
నాకు స్పోర్ట్స్ సినిమా చేయాలని ఉంది. ఎప్పటి నుంచో అది కలగానే ఉంది. విరాట్ కోహ్లీగా నటిస్తారా? అని వ్యాఖ్యాత అడగగా, చాలా బావుంటుంది అని చరణ్ సమాధానమిచ్చాడు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!