టీమిండియా మాజీ లెజెండ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికైన అశ్విన్.. మూడో టెస్ట్ మ్యాచ్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. కాగా.. ఆయన స్థానంలో మిగతా టెస్టు మ్యాచ్‌ల కోసం యువ క్రికెటర్‌ను ఎంపిక చేశారు. మెల్‌బోర్న్‌లో జరిగే బాక్సింగ్ డే టెస్టుకు ముందు బౌలింగ్ ఆల్ రౌండర్ తనుష్ కోటియన్ జట్టులో చేరనున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్‌లో మొదటి టెస్ట్ ఆరంభం అయింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తరఫున నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాలు అరంగేట్రం చేశారు. రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ లేకుండానే భారత్ బరిలోకి దిగింది. ఆశ్చర్యకరంగా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా.. వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇచ్చాడు. యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ జట్టులోకి వచ్చాడు. తొలి టెస్టుకు…
ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు చోటు దక్కలేదు. దాంతో సోషల్ మీడియాలో బీసీసీఐ సెలక్షన్ కమిటీపై ట్రోల్స్ వచ్చాయి. రుతురాజ్ యెల్లో జెర్సీ (చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ) వేసుకోవడం వల్లే ఎంపిక చేయలేదని కామెంట్లు చేశారు. రుతురాజ్‌ను సెలక్ట్ చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా-ఏతో మ్యాచ్‌లకు జట్టును నడిపించే రుతురాజ్.. ప్రధాన టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యంగా…
ఆస్ట్రేలియాపై ఆడాలనేది తన చిన్నప్పటి కల అని తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తెలిపాడు. ప్రతి క్రికెటర్‌కు దేశం తరఫున టెస్టు క్రికెట్ ఆడటం గౌరవంగా భావిస్తాడని, తనకు ఇప్పుడు అలాంటి అవకాశం రానుండటం ఆనందంగా ఉందన్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ నాయకత్వంలో ఎస్‌ఆర్‌హెచ్‌లో ఆడానని, ఇప్పుడు అతడికి వ్యతిరేకంగా బరిలోకి దిగాల్సి ఉంటుందని నితీశ్ చెప్పాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌కు నితీశ్ ఎంపికైన సంగతి తెలిసిందే. పేస్ ఆల్‌రౌండర్ లోటును నితీశ్‌తో…
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తాచాటిన విషయం తెలిసిందే. 303 పరుగులు చేసి, 3 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టులోనూ చోటు సంపాదించాడు. ఇటీవల భారత్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్న నితీశ్.. ఇప్పుడు టెస్టు జట్టులోనూ స్థానం దక్కించుకున్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లే భారత టెస్టు జట్టులో నితీశ్‌కు సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. బంగ్లాదేశ్‌పై తన అరంగేట్ర సిరీస్‌లో నితీశ్ రెడ్డి…
T20 Emerging Asia Cup 2024 IND vs PAK: దాయాది దేశాలు భారత్, పాకిస్థాన్ మైదానంలో తలపడేందుకు మరోసారి సిద్దమయ్యాయి. ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భాగంగా శనివారం ఇండో-పాక్ మ్యాచ్ జరగనుంది. ఒమన్‌లోని అల్ అమరత్ నగరంలో అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుండగా.. భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.…
Asia Cup 2024 India Schedule: అక్టోబర్ 18 నుంచి ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 ప్రారంభం కానుంది. ఒమన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో 8 దేశాల ఏ జట్లు పాల్గొననున్నాయి. గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉండగా.. గ్రూప్-బీలో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ టీమ్స్ ఉన్నాయి. ప్రతి టీమ్ తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో ఓ మ్యాచ్ ఆడుతుంది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన…
Shivam Dube Ract on his performance in T20 World Cup 2024: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తనకు చాలా మద్దతు ఇచ్చారని టీమిండియా యువ ఆటగాడు శివమ్ దూబె తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో ప్రతి మ్యాచ్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, జట్టులోని సహచరులు అండగా నిలిచారన్నాడు. టీ20 ప్రపంచకప్ భారత జట్టు గెలవడంతో తన పాత్ర ఉండటం ఎంతో గర్వంగా ఫీలవుతున్నా అని దూబె చెప్పుకొచ్చాడు.…
Hard work doesn’t go unnoticed says Hardik Pandya: మరో వారం రోజుల్లో శ్రీలంక పర్యటనకు భారత్ వెళ్లనుంది. శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టీ20లను భారత్ ఆడనుంది. రోహిత్ శర్మ టీ20లకు వీడ్కోలు పలికిన నేపథ్యంలో కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యా ముందున్నాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపిక కానున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పెట్టిన పోస్ట్ నెట్టింట ఆసక్తికరంగా మారింది. శ్రమ ఎప్పటికీ వృథా కాదంటూ…
Gautam Gambhir on India Squad against Sri Lanka: ఇటీవల జింబాంబ్వే టూర్ ముగించిన భారత్ మరో పర్యటనకు సిద్ధమైంది. శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ప్రస్తుతం లంక పర్యటనపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ పర్యటనతోనే గౌతమ్ గంభీర్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో.. భారత జట్టు ఎంపికపై అందరిలో ఆసక్తి పెరిగింది. జట్టులో…