భారత్, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కు ఫోన్ చేశారు. అంతకుముందు, అమెరికా విదేశాంగ కార్యదర్శి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్‌కు కూడా ఫోన్ చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. ఉద్రిక్తతలు తగ్గించుకునే చర్యలు చేపట్టాలని పాక్, భారత్ లకు రుబియో సూచించారు.
భారత్, పాకిస్తాన్‌లు ఉద్రిక్తతలను తగ్గించి, ప్రత్యక్ష కమ్యూనికేషన్ మార్గాలను గుర్తించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి ఉత్పాదక చర్చలను సులభతరం చేయడంలో అమెరికా మద్దతును ఆయన ప్రతిపాదించారని విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు.