US: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రపంచ దేశాలపై టారిఫ్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఇండియాపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించారు. మరోవైపు, రేర్ ఎర్త్ ఖనిజాల కోసం పాకిస్తాన్‌తో డీల్ కుదుర్చుకున్నారు. ఇదిలా ఉంటే, ట్రంప్ అవలంభిస్తున్న విధానాలపై యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు, ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు రిచ్ మెక్‌కార్మిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ పట్ల ట్రంప్ తీరును తప్పుపట్టారు. భారతదేశం అమెరికాలో పెట్టుబడుతుపెడుతోందని, పాకిస్తాన్ నుంచి…