పరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి శక్తి స్పష్టంగా కనిపించిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కాగా, ఎవరైనా దానిని మిస్ అయితే, బ్రహ్మోస్ పని తీరు గురించి తెలుసుకోవాలనుకుంటే పాకిస్తాన్‌ను అడగవచ్చని అన్నారు.
Indian Air Force: ఆపరేషన్ సింధూర్‌పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఆపరేషన్ ఇంకా ముగియలేదని తెలిపింది.
కొంతమంది బీజేపీ యాక్టివిస్టులు పాకిస్థాన్ ప్రధాని వచ్చి మోడీ కాళ్లపై పడి ప్రాధేయపడుతున్నట్టు ఏఐ ఫొటోలు సృష్టించి సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. కానీ, అసలు కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు జరిగింది? ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ దొరకని మిస్టరీగా ఉండిపోయింది.
పాకిస్తాన్‌తో కాల్పులు విరమణ ఒప్పందం జరిగిన తర్వాత ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న చర్యను ప్రధాని నరేంద్ర మోడీ వైఖరితో పోల్చుతూ సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది
Jai shankar: భారత్–పాకిస్తాన్ మధ్య గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉద్రిక్తతల తరువాత, ఈరోజు భారత్ పూర్తి, తక్షణ కాల్పుల విరమణ ప్రకటించింది. అయితే, ఈ ప్రకటన అనంతరం దేశ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి సోషల్ మీడియా వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జైశంకర్ తన ట్వీట్‌లో.. “భారత్ ఉగ్రవాదం ఏ రూపంలో వచ్చినా నిర్దాక్షిణ్యంగా వ్యతిరేకిస్తుంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఈరోజు ఒక అవగాహనకు వచ్చాయి. రెండు దేశాలూ…
భారత్, పాకిస్థాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ పోస్ట్ చేసిన కాసేపటికే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ భారత్ విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని చెప్పారు. Also Read: IPL…
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం అర్ధరాత్రి పాకిస్తాన్, పీఓకేలోని 9 ప్రదేశాలపై వైమానిక దాడులు నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సైనిక చర్య జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయాలతో సహా 9 ప్రదేశాలను ధ్వంసం చేసింది. భారత సైనిక దళాలు చేసిన ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అణ్వాయుధ దాడి చేస్తామని, బలమైన ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. యుద్ధం ఆపండి…