Jaishankar: భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విదేశాంగ విధానంపై విదేశాంగ మంత్రి జైశంకర్ సెటైర్లు వేశారు. ఇప్పటికీ కొందరు నెహ్రూ విధానాన్ని గొప్పగా భావిస్తున్నారని, అది బుడగ మాత్రమే అని అన్నారు. నెహ్రూ ఆరాధన నుంచి బయటపడాలని చెప్పారు. న్యూస్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.