తాజాగా ఇండియా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల మైలురాయిని దాటింది. జూలై 17న ఈ కీలకమైలు రాయిని చేరుకుంది. కోవిడ్ 19 వ్యాక్సిన్ 2 బిలయన్ డోసులను అధిగమించడం మాకు గర్వకారణం అని..ఈ ఘనత సాధించినందుకు ఆరోగ్య కార్యకర్తలు, భారత పౌరులను అభిందిస్తున్నానని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్లతో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.