WHO: పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆగ్నేయాసియా ప్రాంత దేశాలకు నిఘా పెంచాలని విజ్ఞప్తి చేసింది. కోవిడ్ 19, దాని కొత్త ఉప-వ్యాధి వేరియంట్ JN.1, ఇన్ఫ్లుఎంజాతో సహా శ్వాసకోశ వ్యాధుల కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా నివారణ చర్యలు తీసుకోవాలని WHO ప్రజలను కోరింది.
భారత్‌లో క్రియాశీల కొవిడ్ కేసులు శుక్రవారం 3 వేల మార్క్‌కు చేరుకున్నాయి. అయితే సబ్-వేరియంట్ JN-1 మొదటి కేసును గుర్తించిన తర్వాత కేసుల ఆకస్మిక పెరుగుదల మధ్య కేరళలో ఒక మరణం నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా చూపించింది. మంత్రిత్వ శాఖ ప్రకారం.. క్రియాశీల కేసులు నిన్న 2,669 ఉండగా.. నేటికి 2,997కి పెరి�
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 12,591 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నిన్నటితో పోలిస్తే 20 శాతం ఎక్కువగా నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొన్ని రోజుల ముందు వందల్లో నమోదైన కేసులు.. ప్రస్తుతం వేలల్లో నమోదవుతుండడం ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. గత కొన్ని రోజుల నుంచి వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కొన్నాళ్ల వరకు కేసుల సంఖ్య కేవలం వందల్లోనే ఉండేది. కానీ ఇప్పు డు పరిస్థితి మారుతోంది.
చైనాతో సహా ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షను తప్పనిసరి చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ శనివారం ప్రకటించారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి అని ఆయన తెలిపారు.
దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే.. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు 5,664 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కరోనా మహమ్మారి బారిన పడి 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే.. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 6,298 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే.. బుధవారం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు 6,422 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్నటితో పోలిస్తే.. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 5,108 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కరోనా మహమ్మారి బారిన పడి 31 మంది ప్రాణాలు కోల్పోయారు.