ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 10 గంటలకు పార్లమెంట్ హౌస్‌లో ప్రారంభమైంది. తొలి ఓటు ప్రధాని మోడీ వేశారు. అనంతరం ఎంపీలంతా ఒక్కొక్కరిగా ఓట్లు వేస్తున్నారు.
భారత 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈరోజు పార్లమెంట్ హౌస్‌లో ఓటింగ్ జరగనుంది. ఎన్డీఏ అభ్యర్థి సీ.పీ. రాధాకృష్ణన్, ఇండియా బ్లాక్ అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పోటీపడుతున్నారు. వసుధలోని రూమ్ నంబర్ F-101లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 10 గంటలకు ఓటు వేస్తారు. రహస్య బ్యాలెట్ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనున్నది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, లోక్‌సభ (543 మంది సభ్యులు),…
భారతదేశ 17వ ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి తరఫున జస్టిస్ సుదర్శన్ రెడ్డిలు పోటీలో ఉన్నారు. ఎన్నిక గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బిజెపి తమ పార్టీ ఎంపీలతో పాటు, ఎన్డీఏ ఎంపీలకు వర్క్ షాప్ నిర్వహిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ విధానంపై మాక్ ట్రైనింగ్ జరుగుతోంది. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తనకు ఓటెయ్యాలంటూ ఇప్పటికే…
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
YS Jagan: ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసి మద్దతు కోరగా, జగన్ తన నిర్ణయాన్ని ఆయనకు స్పష్టంగా తెలియజేశారు. Telangana Assembly News: తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్డీఏ నాయకులు తమతో సంప్రదించారని, ముందుగానే వారికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చామని జగన్ తెలిపారు.…
2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడింది. మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇండియా కూటమి కూడా బాగానే బలం పుంజుకుంది. కాంగ్రెస్‌కు కూడా ఆశించిన స్థాయిలోనే సీట్లొచ్చాయి. ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.
బీహార్‌లో బడుగు బలహీనవర్గాల ప్రజల ఓట్లే తొలగించారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటర్ అధికార్ యాత్ర పేరుతో రాహుల్ గాంధీ బీహార్‌లో పర్యటిస్తున్నారు.
కళంకితులెవరైనా రాజీనామా చేయాల్సిందేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. కళంకిత నేతలు జైలు నుంచి పరిపాలించడమేంటి? అని ప్రశ్నించారు.
ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పి.సి. మోడీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరూ ఊహించని పేరును కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణకు చెందిన బి.సుదర్శన్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.