Infiltration: బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్న అనుమానిత బృందం ప్రయత్నాలను బీఎస్ఎఫ్ అడ్డుకుంది. అస్సాంలోని దక్షిణ సల్మారా మంకాచర్ జిల్లాలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్‌కి చెందిన బృందం చొరబాటు ప్రయత్నాలను బీఎస్ఎఫ్ విఫలం చేసింది. ఈ రోజు తెల్లవారుజామున అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వద్ద అనుమానిత కదలికలను గుర్తించడంతో సరిహద్దు దళాల ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాయి.