India At UN: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి ఐక్యరాజ్యసమితి వేదికగా ‘‘కాశ్మీర్’’ అంశాన్ని లేవనెత్తింది. దీనిపై భారత్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు, శాంతిభద్రతలపై భద్రతా మండలి సమావేశంలో పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని ‘‘రెచ్చగొట్టేవి’’, ‘‘రాజకీయ ప్రచారం’’ అని భారత్ తప్పుపట్టింది. పాకిస్తాన్‌లోని హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పింది.
India At UN: పాకిస్తాన్ మరోసారి తన నైజాన్ని చాటుకుంది. వేదిక ఏదైనా భారత వ్యతిరేక స్వరాన్ని వినిపించడం మానడం లేదు. తాజా మరోసారి యూఎన్ వేదికగా మరోసారి భారత్‌ని ఉద్దేశించి మాట్లాడింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ అయోధ్యలో రామ మందిరం, సీఏఏ గురించి వ్యాఖ్యానించారు. పూర్తి భారత అంతర్గత విషయమైన దీనిపై పాకిస్తాన్ వ్యాఖ్యానించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ వ్యాఖ్యాల్ని ‘‘విరిగిన రికార్డు’’గా అభివర్ణించింది.
India at UN: పాకిస్తాన్ తీరు మారడం లేదు. కుక్క తోక వంకర అనేలా ప్రపంచవేదికలపై భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటోంది. మరోసారి ఐక్యరాజ్యసమితి వేదికగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తింది. అయితే, భారత్ అంతే ధీటుగా పాకిస్తాన్ తీరును ఎండగట్టింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో భారత్ ధీటుగా పాకిస్తాన్‌కి కౌంటర్ ఇచ్చింది. భారతదేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి పాకిస్తాన్‌కి ఎలాంటి అధికారం లేదని చెప్పింది.
India At UN: సమావేశ అజెండాతో సంబంధం లేకుండా దాయాది దేశం పాకిస్తాన్ ప్రవర్తించడం సాధారణంగా మారిపోయింది. అంతర్జాతీయ వేదికలపై ఏ అంశంపై సమావేశం జరిగినా కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తోంది. ఇప్పటికీ చాలా సార్లు పాక్ వైఖరిని భారత్ తూర్పారపట్టింది. అయినా కూడా తన బుద్ధిని మార్చుకోవడం లేదు. ఇప్పటికే చాలా సార్లు ఇది తమ అంతర్గత వ్యవహారమని, భారత్ లో జమ్మూ కాశ్మీర్ భాగంగా ఉంది, ఉంటుంది అని భారత్ ఘాటుగానే స్పందిస్తోంది.
India at UN: తూర్పు జెరూసలేంలో పాటు ఆక్రమిత పాలస్తీనా భూభాగం, ఆక్రమిత సిరయన్ గోలన్ ప్రాంతాల్లో ఇజ్రాయిల్ సెటిల్‌మెంట్ కార్యకలాపాలను ఖండిస్తూ ఐక్యరాజ్యసమితితో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి మద్దతుగా ఇజ్రాయిల్ వైఖరిని ఖండిస్తూ భారత్ ఓటసింది. తీర్మానానికి అనుకూలంగా 145 దేశాలు ఓటేయగా అందులో భారత్ కూడా ఉంది. ఈ ముసాయిదా తీర్మానానికి నవంబర్ 9 గురువారం ఆమోదం లభించింది.
India at UN: భారతదేశం మరోసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్‌సీ) నిర్మాణంపై నిలదీసింది. ఐక్యరాజ్యసమితిలో భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధి, రుచిరా కాంబోజ్ భద్రతా మండలి యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని ప్రశ్నించారు. ఐదు దేశాలు ఇతర దేశాలను ఇతరుల కన్నా ఎక్కువ చేయడం ద్వారా ఐక్యరాజ్యసమితి అందర్ని కలుపుకుపోవడం లేదని చెప్పింది. యూఎన్ లో ప్రపంచ శాంతి కోసం జరిగిన బహిరంగ చర్చ సందర్భంగా కాంబోజ్ మాట్లాడారు.
India at UN: పాకిస్తాన్ ప్రజలు ఆకలితో, అధిక రేట్లు, ఆహార సంక్షోభంతో అల్లాడుతున్నా అక్కడి ప్రభుత్వానికేం పట్టడం లేదు. వీలుదొరికినప్పుడల్లా భారత్ పై విషాన్ని చిమ్ముతూనే ఉంది. తాజాగా మరోసారి భారత్ లక్ష్యంగా పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో విమర్శించింది. అయితే భారత్ అంతే ధీటుగా పాకిస్తాన్ కు బుద్ది చెప్పింది. రక్షణ కొనుగోళ్లు, కాశ్మీర్ లో మానవహక్కుల ఉల్లంఘనపై భారత్ పై విమర్శలు చేశారు. దీనికి భారత ప్రతినిధి సీమా పుజాని స్ట్రాంగ్…