ఒకప్పుడు జట్టులో సచిన్ టెండూల్కర్ ఉంటే చాలు.. చింతించాల్సిన అవసరం లేదని చెప్పుకునే వారు. అంతటి గొప్ప ఆటగాడు ఆ మాస్టర్ బ్లాస్టర్. ఆయన క్రీజులో అడుగుపెట్టాడంటే.. బౌలర్లందరికీ హడల్. అందుకే, ముందుగా ఆయన్నే ఔట్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకునేవారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా పెవిలియన్ పంపాలని.. రకరకాల వ్యూహాలకు పాల్పడేవారు. తానూ అలాంటి వ్యూహమే 2006లో రచించానని, కానీ అది ఫలించలేదని తాజాగా ఓ సీక్రెట్ రివీల్ చేశాడు పాక్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్.…